3. ఎగురుచున్నది

ఎగురుచున్నది విజయ పతాకం

యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును

సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును

రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే

రక్తమే జయం యేసు రక్తమే జయం

1. యేసుని నామం ఉఛ్చారింపగానే

సాతానుని సైన్యము వణకుచున్నది

వ్యాధుల బలము నిర్మూలమైనది

జయం పొందెడి నామము నమ్మినప్పుడే

2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం

యెడతెగకుండగ మనము స్మరణ చేయుదం

పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన

క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం

3. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా

ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా

నీ పాద పద్మము పై చేరియున్న ప్రజలను

స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే