1. కృపామయుడా
కృపామయుడా నీలోనా... నివసింపజేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో
1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో నీవే - నా ఆశ్రయమైనందున
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయ
రాజవంశములో - యాజకత్వము చేసెదను
3. నీలో నిలిచి ఆత్మఫలములు - ఫలియించుట కొరకు
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు
4. ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను