11-Naa-Praana-Priyudavu-Neeve
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణనాథుడా నీవే
ఎవ్వరు లేరు నాకు ఇలలో - నీవే నాకు సర్వము
నా దేవా నా ప్రభువా - యేసు
1. గాఢాంధకారములో - నీవే నాకు దీపము
భీకర తూఫానులో - నీవే నాకు దుర్గము
2. చీకుచింతలలో - కృంగి నేనుండగా
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే
3. నీ ప్రేమ బంధము - నన్ను వెంటాడెను
నీ రెక్కల నీడకు - నన్ను నడిపించెను