12-Praaneshwara
ప్రాణేశ్వరా! ప్రభు దైవకుమారా!
ప్రణుతింతును నిన్నే ఆశ తీరా...
1. నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె
నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే
2. మూలరాయి నీవైయుండగా - అపొస్తలుల పునాది మీద
నిత్య నివాసముగా కట్టబడుటకై - ఆత్మాభిషేకము అనుగ్రహించితివే
3. పిడుగులు విసిరే మెరుపులవంటి - శత్రువులు నాకు ఎదురై నిలచిన
నాకు విరోధముగా రూపించిన - ఏ ఆయుధము వర్ధిల్లలేదే
4. నా ఊటలన్నియు నీయందేనని - వాద్యము వాయించి పాడెదను
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము
5. కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైనా
కనబడిన నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూర ధ్వనికై