13-Neeti-Vaagula-Koraku

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా! ప్రభుని స్తుతియించుమా!

నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా...

1. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి

నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి

నీదు అడుగుజాడలనే వెంబడింతు ప్రభు - నే వెంబడింతు ప్రభు

2. అంధకారపు లోయలలో నేను నడచితిని

ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి

కంటి పాపగా నీవు నన్ను కాచితివి

కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను - ఇలలో నిన్ను కొలచెదను

3. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి

నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి

నీదు అడుగుజాడలనే వెంబడింతు ప్రభు - నే వెంబడింతు ప్రభు

4. అంధకారపు లోయలలో నేను నడచితిని

ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి

కంటి పాపగా నీవు నన్ను కాచితివి

కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను - ఇలలో నిన్ను కొలచెదను

5. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు

ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును

నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు

నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును - నే ఇలలో జీవింతును