14-Yesu-Raju-Rajula-Rajai
యేసు రాజు - రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే - హోసన్నా జయం మనకే
1. యొర్దాను ఎదురైనా - ఎఱ్ఱ సంద్రము పొంగిపొర్లినా
భయము లేదు జయము మనకే - విజయ గీతము పాడెదము
2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా
యేసు గాయముల్ స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్
3. హల్లెలూయా స్తుతి మహిమ - ఎల్లప్పుడు
హల్లెలూయా స్తుతి మహిమ
యేసు రాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె