15-Shashwatha-Krupanu
శాశ్వత కృపను నేను తలంచగా
కానుకానైతిని నీ సన్నిధిలో
1. నా హృదయమెంతో జీవము గల దేవుని
దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది
నా దేహమెంతో నీకై ఆశించే
2. దూతలు చేయని నీ దివ్య సేవను
దూళినైన నేను చేయ కృప నిచ్చితివే
ధూపార్తిని చేపట్టి చేసెద
3. భక్తిహీనులతో నివసించుట కంటెను
నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట
వెయ్యి దినాల కంటే శ్రేష్ఠమైనది
4. సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్త పాత పాడెద
సీయోను రారాజువు నీవెగా
5. నూతనమైన ఈ జీవమార్గమందున
నూతన జీవము ఆత్మభిషేకమే
నూతన సృష్టిగా నను మార్చెను