17-Naa-Jeevam-Nee-Krupalo

నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా

ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం

1. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే

పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలిచితివే

2. ఐగుప్తు విడచినా - ఎఱ్ఱ సముద్రము అడ్డురానే వచ్చెనే

నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చేనే

3. కానాను యాత్రలో యొర్దాను అలలచే కలతచెందితినే

కాపరివైన నీవు దహించు అగ్నిగా - నా ముందు నడిచితివే

4. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే

వాక్యమైయున్న నీ సహవాసము - ధైర్యము పుట్టించెనే

5. స్తుతుల మధ్యలో నివసించువాడా - స్తుతికి పాత్రుడా

స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణచేతునే