వందనము
వందనము - నీకే నా వందనము
వర్ణనకందని - నీకే నా వందనము
నీ ప్రేమ నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా
దాని లోతు, ఎత్తునేగ్రహించి - నీ ప్రాణ త్యాగమునే తలంచి
సర్వకృపానిధి నీవే - సర్వాధిపతియును నీవే
సంఘానికి శిరస్సు నీవే - నా సంగీత సాహిత్యము నీవే
పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె
పరము నుండి పోయబడె - పరవశించి నేను పాడెదను
మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి
కృషి లేక నీ కృప రక్షించెను - కృతజ్ఞతార్పణలర్పింతును
తండ్రియైన దేవునికే - కుమారుడైన దేవునికే
పరిశుద్ధాత్మ దేవునికే - వందనవందనా వందనము