2. ఆనంద యాత్ర
ఆనంద యాత్ర - ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరూషలేము యాత్ర - మన
1. యేసుని రక్తము - పాపముల నుండి విడిపించెను
వెయ్యి నోళ్ళతో స్తుతియించినను - తీర్చలేము ఆ ఋణమును
2. రాత్రియు పగలును - పాదములకు రాయి తగులకుండ
మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకు ఉండగా
3. కృతజ్ఞత లేనివారు - వేలకొలదిగా కూలినను
కృపా వాక్యమునకు సాక్షులమై - కృప వెంబడి కృప పొందెదము
4. ఆనందం ఆనందం - యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానందభరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం