నా ప్రాణ ప్రియుడా

నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా 

నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం

నీ సత్యము సమాజములో 

నీ నీతిని - నా హృదయములో 

దాచియుంచలేను ప్రభు 

స్తుతియాగముగా - నూతన గీతము - నే పాడెద

జ్ఞానులకు నీ సందేశం 

మతకర్తలకు నీ ఉపదేశం 

అర్ధము కాకపోయెనే 

పతితాలెందరో నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే

నా యెడ నీకున్న తలంపులు 

బహు విస్తారములైయున్నవి 

వాటిని వివరించి చెప్పలేనే 

అవి అన్నియును లెక్కకుమించినవై ఉన్నవి - అయున్నవి