3-Noothana-Yerushalem

నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది

పెండ్లి కుమార్తె వలె - మహిమతో నిండి

స్వర్గము నందున్న- దేవుని యొద్ద నుండి

శోభ కలిగిన - ఆ దివ్య నగరము

వర్ణింప శక్యము కానిదియే

బహుసహస్రముల - సూర్యుని సూర్యుని కంటే

ప్రజ్వలించుచున్నది మహిమ వలెను

పరిపూర్ణమైన సౌందర్యమును

పృథ్వికి ఆనందముగాను

భూరాజులందరు - మహిమ తెచ్చెడి

మహిమ గల - నగరము ఇదియే

ధగధగ మెరయు సూర్యకాంతం వలె

జ్వలించుచున్న- దైవ నగరమందు

నీతిమంతులే - సూర్యుని వలెను

నిత్యానిత్యముగా ప్రకాశించుచుందురు