6-Naa-Priyuda-Yesayya
నా ప్రియుడా - యేసయ్య
నీ కృప లేనిదే - నే బ్రతుకలేను
క్షణమైనా - నే బ్రతుకలేను
నీ చేతితోనే నన్ను లేపినావు
నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి
నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి
నీ వాక్కులన్ని - వాగ్ధానములై
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి
నీ వాగ్దానములు - మార్పులేనివి
ముందెన్నడూ - నేను వెళ్ళని
నూతనమైన మార్గములన్నిటిలో
నా తోడు నీవై - నన్ను నడిపినావు
సర్వోన్నతుడా - సర్వకృపానిధి
సర్వసంపదలు - నీలోనే ఉన్నవి
నీవు నా పక్షమై - నిలిచియున్నావు