4-Shashwathamainadhi

శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప

అనుక్షణం నన్ను కనుపాప వలె కాచిన కృప

1. నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి

నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో

2. తల్లి తన బిడ్డలను మరచినా - నేను మరువలేనంటివే

నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే

3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా

నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే

4. తట్టుడి మీకు తెరచెదను - వెదకు వారికి దొరికెదను

అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చెదనంటివే