8-Nenu-Velle-Margamu
నేను వెళ్లే మార్గము - నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా... ఆమెన్
కడ లేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకునా
గురిలేని తరుణాన వెరువగా - నా దరినే నిలిచేవా - నా ప్రభూ
జలములలో పడి నే వెళ్ళినా - అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడిచినా - జ్వాలలు నన్ను కాల్చజాలవు
విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన - నా ప్రభూ
సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా - నా ప్రభూ