9-Yesayya-Naa-Priya
యేసయ్య నా ప్రియా!
ఎప్పుడో నీ రాకడ సమయం
దురవస్థలలో ఒంటరినై
దుమికి ధూళిగా మారినను
దూరాన నీ ముఖ దర్శనము
ధ్రువ తారగా నాలో వెలిగెనే
మరపురాని నిందలలో
మనసున మండే మంటలలో
మమతను చూపిన నీ సిలువను
మరచిపోదునా... నీ రాకను
ప్రియుడా నిన్ను చూడాలని
ప్రియునివలెనే మారాలని
ప్రియతమా నా కాంక్ష తీరాలని
ప్రియమార నా మది కోరినే
ప్రాణమిత్రులే శత్రువులై
ప్రాకారములను కూల్చినను
ప్రాణమునర్పించిన నీ కొరకే
ప్రాణార్పణముగా నిల్చెదనే